
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన అల్లు హీరో శిరీష్ సొంతంగా ఓ ఇమేజ్ ఏర్పచుకోవడంలో వెనుకపడి ఉన్నాడు. సినిమాలైతే చేస్తున్నాడు కాని తగినంత క్రేజ్ తెచ్చుకోలేదు. తెలుగుతో పాటుగా మళయాల, తమిళ పరిశ్రమలో కూడా సినిమాలు చేస్తున్నాడు ఈ అల్లు హీరో. మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ తో స్క్రీన్ షేర్ చేసుకున్న శిరీష్ లేటెస్ట్ గా కె.వి.ఆనంద్ డైరక్షన్ లో సినిమాలో సూర్యతో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఓకే అన్నాడు.
మధ్యలో ఏమైందో ఏమో కాని సినిమా నుండి తాను ఎక్సిట్ అయ్యానని స్వయంగా అల్లు శిరీష్ ప్రకటించడం ప్రస్తుతం హాట్ న్యూస్ గా మారింది. సూర్య సినిమాలో శిరీష్ అనగానే అతనికి మంచి మైలేజ్ వస్తుందని భావించారు కాని వెంటనే సినిమా నుండి బయటకు వస్తున్నట్టు చెప్పగా అందరు షాక్ అయ్యారు. డేట్ల సమస్య వల్ల ఆ సినిమా నుండి ఎక్సిట్ అయినట్టు చెబుతున్నారు కాని కోలీవుడ్ మీడియా మాత్రం సినిమా నుండి శిరీష్ ను కావాలనే తప్పించారని అంటున్నారు. మరి ఇందులో ఏది వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది.