నాగశౌర్య నర్తనశాల ఫస్ట్ లుక్ రిలీజ్..!

నాగశౌర్య హీరోగా శ్రీనివాస్ చక్రవర్తి డైరక్షన్ లో వస్తున్న సినిమా నర్తనశాల. ఛలోతో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య మరోసారి తన సొంత బ్యానర్ లో ఈ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఓ డ్యాన్స్ మూమెంట్ తో @ నర్తనశాల తో వచ్చాడు నాగశౌర్య. ఎన్.టి.ఆర్ నటించిన సూపర్ హిట్ మూవీస్ లో నర్తనశాల ఒకటి.

బాలకృష్ణ ఈ టైటిల్ తో సినిమా తీయాలని చూశారు కాని కుదరలేదు. ఫైనల్ గా @ నర్తనశాల అంటూ నాగశౌర్య సర్ ప్రైజ్ చేశాడు. ఛలో తర్వాత ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో సొంత బ్యానర్ లోనే ఈ సినిమా నిర్మిస్తున్నారు. నాగశౌర్య హిట్ మేనియాను ఈ సినిమా కంటిన్యూ చేస్తుందని అంటున్నారు. ఫస్ట్ లుక్ ఫ్రెష్ గా అనిపిస్తుండటంతో సినిమాపై ఆడియెన్స్ కూడా మంచి అంచనాలతో ఉన్నారు.