కే.టి.ఆర్ తో మమ్ముట్టి స్పెషల్ మీటింగ్..!

తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కే.టి.ఆర్ ను మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి కలిశారు. ఈ నెల 25న హైదరాబాద్ లో జరుగనున్న కైరాలి పీపుల్ ఇన్నోటెక్ అవార్డ్స్ కార్యక్రమానికి కే.టి.ఆర్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించేందుకు మమ్ముట్టి వచ్చారు. ఈ సందర్భంగా కే.టి.ఆర్ మమ్ముట్టికి చార్మినార్ ప్రతిని బహుకరించారు. కే.టి.ఆర్ ఈ ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పెట్టారు.

దివంగత నేత వైఎస్సార్ బయోపిక్ లో రాజశేఖర్ రెడ్డిగా మమ్ముట్టి నటిస్తున్నారు. యాత్ర టైటిల్ తో వస్తున్న ఈ సినిమాను మహి వి రాఘవ డైరెక్ట్ చేస్తున్నారు. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచేసింది. 2019 సంక్రాంతి బరిలో యాత్ర రిలీజ్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.