
ఎన్నో అంచనాలతో తెరకెక్కుతున్న ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమాపై రోజుకో వార్త సంచలనంగా మారుతుంది. ఇప్పటికే ఇందులో నటించే కాస్ట్ విషయంలో ఎవరున్నారు ఎవరు లేరు అన్న విషయంపై వార్తలు వస్తుండగా లేటెస్ట్ గా ఈ సినిమా నుండి ప్రముఖ హీరో శర్వానంద్ ఎక్సిట్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎన్.టి.ఆర్ యుక్త వయసు పాత్రలో శర్వానంద్ నటించే అవకాశాలున్నాయని టాక్.
ఇప్పుడు ఆ పాత్ర చేస్తే తన కెరియర్ కచ్చితంగా ఇబ్బందుల్లో పడుతుందని గుర్తించాడట శర్వానంద్. అంతేకాదు నందమూరి ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయకుంటే కష్టమని భావిస్తున్నాడట. శర్వా ఎక్సిట్ అయిన ఈ పాత్రలో ఫైనల్ గా నందమూరి వారసుడు మోక్షజ్ఞ నటిస్తాడని తెలుస్తుంది. మోక్షజ్ఞ చేయడం ఎంతవరకు నిజం అన్నది తెలియదు కాని అలా చేస్తే మోక్షజ్ఞకు ఇది పర్ఫెక్ట్ డెబ్యూ అవుతుందని ఆశిస్తున్నారు. నందమూరి ఫ్యాన్స్.