బన్ని 'సరైనోడు' మరో క్రేజీ రికార్డ్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను డైరక్షన్ లో వచ్చిన మూవీ సరైనోడు. ఊర మాస్ మూవీగా వచ్చిన ఈ సినిమా బన్ని కెరియర్ లో మరో హిట్ అందుకునేలా చేసింది. అయితే 2016 లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పిటికీ రికార్డులు కొనసాగిస్తుండటం విశేషం. అదెలా అంటే ఈ సినిమా హింది డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తుంది. 1 కాదు రెండు కాదు ఏకంగా 200 మిలియన్ వ్యూస్ తో ఈ సినిమా సంచలనం సృష్టించింది.

బాలీవుడ్ లో బన్ని ఫాలోయింగ్ ఈ రేంజ్ లో ఉందా అని అందరు ముక్కున వేలేసుకుంటున్నారు. వ్యూస్ లోనే కాదు ఈ సినిమా లైకుల్లో కూడా ఏ ఇండియన్ సినిమా అందుకోలేని విధంగా అత్యధికంగా 665 వేల లైక్స్ అందుకుంది. తెలుగులో బాక్సాఫీస్ ను మాత్రమే షేక్ చేసిన ఈ సినిమా యూట్యూబ్ లో అన్ని రికార్డులను చెరిపేసింది. ఈ ఫాం చూస్తుంటే బన్ని బాలీవుడ్ ఎంట్రీ టైం వచ్చేసిందని అనిపిస్తుంది. మరి యూట్యూబ్ సెన్సేషన్ సరైనోడుపై బన్ని రెస్పాన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.