వారాహి బ్యానర్ లో బన్ని..!

మెగాస్టార్ చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన విజేత సినిమా టాక్ యావరేజ్ గా వచ్చినా కలక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేవు. అయినా సరే సినిమా హిట్ అన్నట్టుగా చిత్రయూనిట్ విజయోత్సవ వేడుక జరిపారు. రిలీజ్ అయిన నాటి నుండి నేటి వరకు ఒక్కో సందర్భంలో ఒక్కో మెగా హీరో ఈ సినిమాను ప్రమోట్ చేస్తుండటం చూస్తూనే ఉన్నాం.

రిలీజ్ నాడు చిరంజీవి.. ఆ తర్వాత రోజు రాం చరణ్ విజేత సినిమాపై స్పందించగా.. విజయోత్సవ సభకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అటెండ్ అయ్యి సినిమాపై తన స్పందన తెలియచేశారు. ముఖ్యంగా చిరంజీవి అంటే తనకు ఎంత ఇష్టం ఉందో చెబుతూ మా ఇంటి అల్లుడు అంటూ కళ్యాణ్ గురించి మాట్లాడాడు. ఇక సినిమాలో మురళిశర్మ నటన గురించి ప్రత్యేకంగా ప్రస్థావించగా.. కొత్తవాళ్లని ప్రోత్సహిస్తున్న వారాహి బ్యానర్ కు తన విశెష్ అందించాడు. ఛాన్స్ దొరికితే తాను వారాహి బ్యానర్ లో నటిస్తానని చెప్పి సాయి కొర్రపాటికి మాటిచ్చాడు బన్ని. సో బన్నిని మెప్పించే కథ దొరికితే వారాహి బ్యానర్ లో సినిమా షురూ అయినట్టే.