
అజయ్ భూపతి దర్శకత్వంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లీడ్ రోల్స్ లో నటించిన సినిమా ఆరెక్స్ 100. జూలై 12 (గురువారం) రిలీజ్ అయిన ఈ సినిమా టాక్ ఎలా ఉన్నా కలక్షన్స్ మాత్రం బాగా రాబడుతుంది. 4 రోజుల్లో ఈ సినిమా 5.19 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తుంది. సినిమా సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతికి అదిరిపోయే ఆఫర్లు వస్తున్నాయట.
ఇప్పటికే భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ అజయ్ తో డిస్కషన్స్ నడుపుతున్నాడని తెలుస్తుంది. రామ్ కోసం స్రవంతి రవికిశోర్ కూడా అజయ్ తో చర్చలు జరుపుతున్నారట. నితిన్ కోసం సుధాకర్ రెడ్డి కూడా అజయ్ తో టచ్ లో ఉన్నాడట. మొదటి సినిమా లిమిటెడ్ బడ్జెట్ లో తీసినా వచ్చిన ఆఫర్స్ చూస్తే ఈసారి అజయ్ భారీ బడ్జెట్ తోనే సినిమా తీసే అవకాశం కనిపిస్తుంది. మరి ఇన్ని ఆఫర్స్ లో ఏది ముందు అజయ్ ప్రొసీడ్ అవుతాడో చూడాలి.