లవర్ ట్రైలర్.. మళయాల పిల్లతో లవ్ స్టోరీ..!

యువ హీరో రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు సమర్పణలో అనీష్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా లవర్. రిధి కుమార్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ట్రైలర్ చూస్తే ఓ మెకానికల్ ఇంజినీర్ మళయాల అమ్మాయితో లవ్ లో పడటం ఆ తర్వాత ఆ అమ్మాయి రిస్క్ లో పడితే ఆమెను ఎలా కాపాడాడు లాంటి కథతో వస్తుందని తెలుస్తుంది.  

ట్రైలర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. సినిమా టైటిల్ ను బట్టి ఇదో లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. అయితే ఇందులో రాజ్ తరుణ్ యాక్షన్ పార్ట్ కూడా సర్ ప్రైజ్ చేస్తుందని అంటున్నారు. సినిమాలో రాజ్ తరుణ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. లవర్ ట్రైలర్ ఇంప్రెస్ చేయగా ఈ నెల చివరన రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.