చైతు, సమంత.. మళ్లీ.. మళ్లీ..!

అక్కినేని నాగ చైతన్య, సమంతల మ్యారేజ్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో జరిగిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత సమంత ఏమాత్రం స్పీడ్ తగ్గలేదు. ఇంకా వరుస సక్సెస్ లను అందుకుంటుందని చెప్పాలి. పెళ్లి తర్వాత వారిద్దరు కలిసి ఒకే సినిమాలో కనిపించలేదు. లేటెస్ట్ గా నిన్ను కోరి డైరక్టర్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు. చైతు, సమంతలను హీరో హీరోయిన్స్ గా సెలెక్ట్ చేసుకుని ఓ సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాతో పాటుగా మరో సినిమాలో చైతు, సమంత కలిసి నటిస్తారని తెలుస్తుంది. సుశాంత్ హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా చిలసౌ. టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా సుశాంత్ కు హిట్ ఇచ్చేలా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా తర్వాత రాహుల్ రవింద్రన్ మరో సినిమా డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఆ సినిమాలో చైతు, సమంతలు లీడ్ రోల్స్ గా నటిస్తారని టాక్. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. హీరోగా తనకు అవకాశాలు రాకపోవడంతో రాహుల్ రవింద్రన్ దర్శకుడిగా కొత్త టర్న్ క్రేజ్ తెచ్చేలానే అనిపిస్తుంది.