
ఇన్నాళ్లు సినిమాలకే సెన్సార్ ఉండేది. తమ క్రియేటివిటీ చూపించేందుకు కొందరు ఔత్సాహికులు షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. అయితే ఈమధ్య కొత్తగా షార్ట్ ఫిలిమ్స్ కన్నా వెబ్ సీరీస్ ల మీద క్రేజ్ ఎక్కువైంది. షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ఉన్నా సరే వెబ్ సీరీస్ గా దాన్ని బయటకు తెస్తున్నారు. అయితే అందులో సెన్సార్ కట్లు పడాల్సిన సీన్స్, డైలాగ్స్ ఉన్నా నిరభ్యంతరంగా రిలీజ్ చేస్తున్నారు.
రీసెంట్ గా ఆన్ లైన్ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ప్లిక్స్ రిలీజ్ చేసిన సాక్రెడ్ గేమ్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపింది. విక్రం చందా నవల స్కేర్డ్ గేమ్స్ ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్ సీరీస్ సైఫ్ ఆలీ ఖాన్, రాధికా ఆప్టే, నవాజుద్ధీన్ సిద్ధికీ నటించారు. అందులో రాజీవ్ గాంధీని అసభ్య పదజాలంతో దూషించారని కోల్ కతాకు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
ఇంటర్నెట్ కంటెంట్ మీద నియంత్రించడం జరుగదు కాని హింస, అశ్లీలతకు సంబందించిన అంశాల పట్ల వెబ్ సీరీస్ లో కూడా సెన్సార్ ను ఏర్పాటు చేయాలని చూస్తున్నారట ప్రసార మంత్రిత్వ శాఖ.