నూతన్ మళ్లీ వస్తాడా..!

బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో ముగ్గురు కామన్ మెన్ కు ఛాన్స్ ఇచ్చారు. సంజనా, నూతన్ నాయుడు, గణేష్ లలో గణేష్ ఇంకా హౌజ్ లో ఉండగా.. సంజనా, నూతన్ నాయుడు మొదటి రెండు వారాల్లో బయటకు వచ్చారు. మూడవ వారం కిరీటి, నాల్గవ వారం శ్యామలా బిగ్ బాస్ హౌజ్ వదిలి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండో వారం ఎలిమినేట్ అయిన నూతన్ నాయుడు ఎంత పవర్ ఫుల్ కామన్ మెన్ అన్నది బయటకు వచ్చాక తెలిసింది.

ఇక ఆయన బయటకు వచ్చిన విధానం కూడా సరిగా అనిపించలేదు. అంతేకాదు నూతన్ నాయుడుకి ఇప్పుడు బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అందుకే మళ్లీ బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా పంపించాలని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. అయితే ఆడియెన్స్ కోరినంత మాత్రాన జరుగుతుందా అంటే ఏమో చెప్పలేం అంటున్నారు. మొత్తానికి నూతన్ నాయుడు మళ్లీ బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్తే మాత్రం గేం మరింత రసవత్తరంగా మారుతుందని మాత్రం చెప్పొచ్చు.