మెగా అల్లుడు సేఫ్ గేమ్.. వర్క్ అవుట్ అయినట్టే..!

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన మరో హీరో కళ్యాణ్ దేవ్ఎంట్రీ సక్సెస్ ఫుల్ అయ్యింది. మెగాస్టార్ ఈ సినిమాను దగ్గరుండి చూసుకున్నారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ లో నటనలో పరిణితి చూపించాలని అంటున్నా ఓవరాల్ గా కళ్యాణ్ దేవ్ ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసినట్టే అని తెలుస్తుంది. హీరోగా అతని కెరియర్ ఎలా ఉండబోతుంది అన్నది తెలియదు కాని మొదటి సినిమా కోసం చిరు ఆడిన సేఫ్ గేమ్ మాత్రం బాగా వర్క్ అవుట్ అయ్యింది.    

యాక్షన్ జోలికి వెళ్లకుండా సెంటిమెంట్ మూవీతో వచ్చిన కళ్యాణ్ దేవ్ ఒక వర్గం ప్రేక్షకులకు నచ్చేశాడు. అయితే యూత్ నచ్చే అంశాలకు కొదవలేకపోవడంతో వారి మెప్పు పొందాడు. మొత్తానికి విజేతగా కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర విజేత అయ్యే కంటెంట్ తోనే వచ్చాడు. సినిమాలో కళ్యాణ్ దేవ్ నటన కన్నా తండ్రి పాత్ర చేసిన మురళి శర్మ గురించి అందరు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.