
అక్కినేని అఖిల్ హీరోగా తొలిప్రేమ సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమానే మొదటి సక్సెస్ అందుకున్న వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం లండన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా షూటింగ్ టైంలో దర్శకుడు వెంకీకి, అఖిల్ కు మధ్య గొడవ జరిగిందని, ఇద్దరి మధ్య సఖ్యత లేదని దాని వల్ల షూటింగ్ సజావుగా సాగట్లేదని మీడియా టాక్.
అయితే తన ప్రతి సినిమా విషయంలో ఇలాంటి న్యూస్ స్ప్రెడ్ అవడం అఖిల్ కు తలనొప్పిగా మారింది. అందుకే రూమర్స్ తన దాకా వచ్చాయో లేదో వెంటనే చెక్ పెట్టేలా ఓ వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో దర్శకుడు వెంకీతో అఖిల్ తనకి నాకు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్న మాట నిజమే అంటూ చెప్పుకొచ్చాడు. వీడియో చివరలో ఇద్దరు గట్టిగా నవ్వారు. సో దీన్ని బట్టి చూస్తే ఇదంతా ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. అఖిల్, వెంకీ అట్లూరి సినిమా సజావుగానే షూటింగ్ జరుపుకుంటుందని ఈ వీడియో ద్వారా తెలుస్తుంది.