
సంచలనాల శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ మీద ఇంకా తన సంచలన వ్యాఖ్యలు కొనసాగిస్తూనే ఉంది. ఇన్నాళ్లు టాలీవుడ్ లో తనకు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తి మాట్లాడిన శ్రీరెడ్డి లేటెస్ట్ గా తన ఫోకస్ కోలీవుడ్ మీద పెట్టినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం శ్రీరెడ్డి టార్గెట్ లో తమిళ దర్శకుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్, హీరో శ్రీరాం ఉన్నట్టు తెలుస్తుంది.
రాఘవ లారెన్స్ ఓ సినిమా విషయంలో తనని మోసం చేశాడని. అతని మెడలో రాఘవేంద్ర స్వామి లాకెట్ ఉంటుంది. మంచోడిగా నటిస్తూ చేయాల్సిది చేస్తాడని కామెంట్ చేసింది శ్రీరెడ్డి. ఇక శ్రీరాం కూడా ఐదేళ్ల క్రితం జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో పరిచయం ఏర్పడిందని. అతనితో ఓ నైట్ మొత్తం హోటల్ లో కలిసి ఉన్నానని.. ఫ్రెండ్ షిప్ పేరుతో తనని మోసంచేశాడని. తనకు సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చెప్పి పరారయ్యాడని శ్రీరాం మీద విమర్సలు గుప్పించింది శ్రీరెడ్డి. మరి ఈ కామెంట్స్ పై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.