అఖిల్ మళ్లీ వేలుపెడుతున్నాడా..!

అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో ఓ సినిమా సెట్స్ మీద ఉందని తెలిసిందే. బోగవల్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా కూడా లవ్ స్టోరీగా రాబోతుందట. తొలిప్రేమ తర్వాత వెంకీ అట్లూరి చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే వెంకీ డైరక్షన్ లో అఖిల్ వేలుపెడుతున్నాడని టాక్. కథ విషయంలో అఖిల్ తనకు నచ్చినట్టుగా మార్చాలని అన్నాడట. వెంకీ మాత్రం అలా కుదరదని గట్టిగా చెప్పే షూటింగ్ లోకి దిగాడట.

ఇక ఇప్పుడు షూటింగ్ టైంలో దర్శకుడిని డిస్ట్రబ్ చేస్తున్నాడట. వెంకీ మాత్రం కేవలం తనకు నచ్చిన విధంగా తీయాలని చూస్తుంటే అఖిల్ మాత్రం ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. అఖిల్, హలో ఫ్లాపుల తర్వాత కూడా అఖిల్ ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్ధం కావట్లేదు. మూడవ సినిమా తప్పకుండా హిట్ కొట్టాల్సిన సినిమా ఒకవేళ అఖిల్ కు ఈ సినిమా తేడా కొడితే మాత్రం ఇక చాలా కష్టమే అని చెప్పొచ్చు.