మల్టీస్టారర్ ప్లాన్ లో దిల్ రాజు..!

బడా నిర్మాత దిల్ రాజు మరో క్రేజీ మల్టీస్టారర్ కు ప్లాన్ చేశారని తెలుస్తుంది. ఈమధ్య సినిమాల జోరు కాస్త తగ్గించినట్టు అనిపించిన దిల్ రాజు మల్టీస్టారర్ మూవీ చేయాలని చూస్తున్నాడట. ఆల్రెడీ దిల్ రాజు బ్యానర్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వచ్చింది. వెంకటేష్, మహేష్ ఇద్దరు కలిసి చేసిన ఆ మూవీ మంచి విజయాన్ని అందుకుంది. దిల్ రాజు బ్యానర్ వాల్యూ పెంచింది సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.

ఇక మళ్లీ అలాంటి మల్టీస్టార్ మూవీ షురూ చేస్తున్నాడట దిల్ రాజు. ఈ సినిమాకు దర్శకుడిగా ఇంద్రగంటి మోహనకృష్ణ పనిచేస్తాడట. మల్టీస్టారర్ లో ఒక హీరో నాని ఉంటాడని తెలుస్తుంది. ఇప్పటికే నాని నాగార్జునతో కలిసి దేవదాస్ మూవీ చేస్తున్నాడు. మళ్లీ మరో మల్టీస్టారర్ చేయబోతున్నని తెలుస్తుంది. మరి నానితో కలిసి చేసే మరో హీరో ఎవరో చూడాలి.