
స్టార్ సినిమా సెట్స్ మీద ఉంటే వారి బర్త్ డేలకు ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా కానుకలు ఇస్తారు. ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఫ్యాన్స్ ఖుషి అయ్యేలా చేస్తారు. ప్రస్తుతం రాబోతున్న పుట్టినరోజుకి అభిమానులకు ఎలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచనలో ఉన్నాడు మహేష్. ఆగష్టు 9న మహేష్ బర్త్ డే. ఆరోజు తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటుగా టైటిల్ కూడా రివీల్ చేస్తారట.
రాజసం టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమా అసలు సర్ ప్రైజ్ ఏంటన్నది తెలుసుకోవాలంటే మరో నెల రోజులు వెయిట్ చేయాల్సిందే. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా దిల్ రాజు, అశ్వనిదత్ కలిసి నిర్మించడం విశేషం. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుండగా అల్లరి నరేష్ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మరి మహేష్ ఇచ్చే ఈ గిఫ్ట్ ఫ్యాన్స్ కు ఎలాంటి జోష్ ఇస్తుందో చూడాలి.