
నానికి హీరోగా లైఫ్ ఇచ్చిన ఇంద్రగంటి మోహనకృష్ణ అష్టా చెమ్మ సినిమాతో అతనికి హిట్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత హీరో నాని కాస్త నాచురల్ స్టార్ నాని అయ్యేదాకా అతనితో మళ్లీ కలిసి పనిచేయని ఇంద్రగంటి మోహనకృష్ణ లాస్ట్ ఇయర్ జెంటిల్ మెన్ సినిమాతో మళ్లీ కలిసి హిట్ కొట్టారు. అయితే ఇప్పుడు ముచ్చటగా మూడోసారి నాని ఇంద్రగంటి మోహనకృష్ణ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నాడట.
ప్రస్తుతం జెర్సీ, దేవదాస్ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్న నాని నవంబర్ కల్లా ఫ్రీ అవుతాడని తెలుస్తుంది. ఇప్పటికే నాని లైన్ ఓకే చెప్పగా ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఈ సినిమాను కె.ఎస్ రామారావు నిర్మిస్తారని తెలుస్తుంది. కొన్నాళ్లుగా సినిమా నిర్మాణానికి దూరంగా ఉన్న కె.ఎస్ రామారావు లేటెస్ట్ గా తేజ్ ఐలవ్యూ సినిమా చేశారు.