
మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం ఏ రేంజ్ లో హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే. 125 కోట్ల కలక్షన్స్ తో నాన్ బాహుబలి రికార్డులనే కాదు చెర్రి కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది రంగస్థలం. ఈరోజుల్లో 100 రోజులు ఆడిన సినిమాలు కనుమరుగవుతున్నాయి. కాని రంగస్థలం స్ట్రైట్ గా 15 సెంటర్స్ లో 100 రోజులు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా చిత్రయూనిట్ శతదినోత్సవ వేడుక జరుపుకుంది. కేవలం చిత్రయూనిట్ మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. సినిమా ఇంత పెద్ద విజయం అందుకుని అందరికి సంతోషాన్ని పంచినందుకు రాం చరణ్ ఎక్కువగా సంతోషించానని అన్నారు. తమతో పాటు పదిమందికి పైకి తీసుకెళ్తే తాము పడిపోతున్నా వారు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. రంగస్థలంలా అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకుని ఇండస్ట్రీకి మంచి జరగాలని అన్నారు.
ఇక ఈ క్రమంలో సుకుమర్ కూడా చరణ్ ఈ సినిమా కోసం పడిన కష్టాన్ని వివరించారు. ఛాన్స్ వస్తే మళ్లీ చరణ్ తో సినిమా చేస్తానని అనగా కథ రెడీ చేస్కో అని చరణ్ చెప్పడం విశేషం. అయితే రంగస్థలం టైంలోనే చరణ్ కోసం మరో రెండు కథలు రాసుకున్నాడట ఇప్పుడు ఈ కాంబినేషన్ లో ఆ రెండు కథలలో ఒకటి మరో సినిమా చేస్తారట. రంగస్థలం తర్వాత మహేష్ తో సినిమా చేస్తున్నాడు సుకుమార్ ఆ తర్వాత మళ్లీ చరణ్ తో సినిమా ఉండే అవకాశం కనిపిస్తుంది.