
జననేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా మహి వి రాఘవ డైరక్షన్ లో వస్తున్న సినిమా యాత్ర. వై.ఎస్.ఆర్ ముఖ్యమంత్రిగా మహాప్రస్థానానికి నాంధి పలికిన పాదయాత్ర నేపథ్యంతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. బయోపిక్ సినిమాలకూ ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారని ఈమధ్య వచ్చిన మహానటి, సంజూ సినిమాలు చూపించాయి. ఆ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా యాత్ర మూవీ వస్తుందని తెలుస్తుంది.
మళయాల స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్న ఈ సినిమాను 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్లా, శషి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. ఇక కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయిన టీజర్ అద్భుతంగా ఉంది. ముఖ్యంగా తెలుసుకోవాలని ఉంది.. వినాలని ఉంది.. ఈ కడప దాటి ప్రతి గడపలోకి వెళ్లాలని ఉంది.. వాళ్లతో కలిసి నడవాలని ఉంది.. వాళ్ల గుండెచప్పుడు వినాలని ఉంది.. గెలిస్తే పట్టుదల అంటారు.. ఓడిపోతే మూర్ఖత్వం అంటారు.. ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో.. పట్టుదలో చరిత్రనే నిర్ణయించుకోవచ్చు.. అంటూ టీజర్ లో వచ్చిన ఈ డైలాగ్ చాలు సినిమా ఎలా మనసులను తాకుతుందని చెప్పడానికి.. వై.ఎస్ గా మమ్ముట్టి అభివాదం టీజర్ కే హైలెట్ అని చెప్పొచ్చు. టీజర్ చూశాక వై.ఎస్ జీవిత యాత్ర.. సినిమా కాదు చరిత్రగా చూపించేస్తున్నారని ప్రతి అభిమాని అనుకునేలా చేశారు. మరి టీజర్ కే ఇలా ఉంటె సినిమా ఎంత గొప్పగా తీశారో చూడాలి.