
ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ ఉంగరాల రాంబాబు సినిమాతో నిరాశపరచినా లేటెస్ట్ గా కె.ఎస్ రామారావు నిర్మాణంలో క్రేజీ ప్రాజెక్ట్ కు రంగం సిద్ధం చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోగా విజయ్ దేవరకొండ నటిస్తున్నాడని అంటున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత టాక్సీవాలా, గీతా గోవిందం సినిమాలు చేసిన విజయ్ క్రాంతి మాధవ్ సినిమా చేయబోతున్నాడట.
ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. కె.ఎస్ రామారావు నిర్మాణంలో క్రాంతి మాధవ్ ఆల్రెడీ మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమా చేశాడు. ఈమధ్యనే సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన తేజ్ ఐలవ్యూ సినిమా నిర్మించిన కె.ఎస్ రామారావు విజయ్ దేవరకొండతో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అర్జున్ రెడ్డితో యూత్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న విజయ్ తో క్రాంతి మాధవ్ సినిమా అంటే డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు.