ఇక ఆపేస్తే బెటర్ అనుకుంటున్న సమంత..!

సౌత్ లో స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సమంత అక్కినేని వారసుడు నాగ చైతన్యను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా కెరియర్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న సమంత ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేశాక ఇక సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేస్తుందని అంటున్నారు. తెలుగులో యూటర్న్ సినిమా చేస్తున్న సమంత తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తుంది.

ఈ సినిమాలు పూర్తయ్యాక సామ్ ఇక హీరోయిన్ గా సినిమాలను చేయడం ఆపేస్తుందట. ఈమధ్యనే నిర్మాతగా మారాలన్న కోరికను బయట పెట్టిన సమంత కెరియర్ లో కొత్త టర్న్ తీసుకోబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కన్నడ యూటర్న్ తెలుగు రీమేక్ నిర్మాణంలో సమంత భాగస్వామ్యం అవుతుంది. ఇక నిర్మాతగానే సినిమాల్లో కంటిన్యూ అవుతుందట. టాలెంట్ ఉన్న వారికి తన ప్రొడక్షన్ ద్వారా అవకాశం ఇచ్చేలా రంగం సిద్ధం చేస్తుందట. హీరోయిన్ గా మానేసి కుటుంబం పిల్లల మీద దృష్టి పెట్టాలని చూస్తుందట.