
బాలకృష్ణ హీరోగా ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ఎన్.టి.ఆర్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు సినిమా షూటింగ్ కూడా నిన్నటి నుండి మొదలుపెట్టారు. ఫస్ట్ లుక్ గా మనదేశంలోని ఎన్.టి.ఆర్ లుక్ గా బాలయ్య కనిపించారు. యంగ్ ఎన్.టి.ఆర్ గా బాలకృష్ణ ప్రొఫైల్ పిక్ ఎలాంటి డౌట్లు కలిగించలేదు.
శాతకర్ణి తర్వాత క్రిష్, బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమా కూడా ఆ సినిమాలానే వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నారు. 2019 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. మనదేశం ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వగా ఈరోజు నుండి షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది. బాలీవుడ్ లో మణికర్ణిక సినిమా పనులను ముగించుకుని క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ గా దృష్టి పెట్టాడు. శాతకర్ణి లానే ఈ సినిమా కూడా చరిత్రలో మిగిలేలా చేస్తాడో లేదో చూడాలి.
నాడు నేడు మనదేశంతోనే చరిత్రకు శ్రీకారం అంటూ క్రిష్ ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే అంచనాలు పెంచేలా చేశాడు. ఎన్.బి.కే ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విద్యా బాలన్, రాజశేఖర్, రానా లాంటి నటులు ఈ సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది.