బన్నితోనే త్రివిక్రం..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య తర్వాత విక్రం కుమార్ తో సినిమాకు సిద్ధమవుతున్నాడు. డివివి దానయ్య ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్ని మరోసారి త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం త్రివిక్రం యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో అరవింద సమేత సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బన్ని కోసం ఓ లైన్ అనుకున్నాడట.

త్రివిక్రం, అల్లు అర్జున్ కలిసి ఇప్పటికే జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు చేశారు. హ్యాట్రిక్ మూవీకి సిద్ధమవుతున్న వీరు కచ్చితంగా మంచి సినిమానే ప్రేక్షకులకు అందిస్తారని ఆశిస్తున్నారు. విక్రం కుమార్ సినిమా త్వరలో సెట్స్ మీద వెళ్లేలా ప్లాన్ చేస్తున్న బన్ని అది మధ్యలో ఉండగానే త్రివిక్రం సినిమాను మొదలు పెడతారని అంటున్నారు. ఎన్.టి.ఆర్ తో చేస్తున్న అరవింద సమేత మూవీ మాత్రం అక్టోబర్ లో రిలీజ్ అవనుంది.