
ఎంచుకున్న కథలకు కమర్షియల్ హంగుల కోసం వెతికే దర్శకులు ఉన్న ఈ రోజుల్లో రాసుకున్న కథను అలానే తీసే ప్రయోగాత్మక దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు చంద్రశేఖర్ ఏలేటి. ఐతే సినిమా నుండి మనమంతా వరకు చంద్రశేఖర్ ఏలేటి సినిమా అంటే ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాయి. ఏలేటితో సాయి ధరం తేజ్ సినిమా అని కొన్నాళ్లు వార్తలు రాగా ఆ తర్వాత ఆ కథ గోపిచంద్ దగ్గరకు వెళ్లిందని అన్నారు.
ఇక ఇప్పుడు ఫైనల్ గా నానితో ఏలేటి సినిమా తీయబోతున్నాడని తెలుస్తుంది. నిన్నటిదాకా నితిన్ తో చంద్రశేఖర్ ఏలేటి సినిమా అంటూ హడావిడి చేయగా ఫైనల్ గా ఆయన కథను నాని ఓకే చేశాడట. నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తుండగా ఆ తర్వాత భరత్ తిన్ననూరితో జెర్సీ సినిమా చేస్తున్నాడు. మరి ఏలేటి లాంటి డిఫరెంట్ డైరక్టర్ నాని ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.