చిరు, పవన్ మల్టీస్టారర్.. అల్లు అరవింద్ ప్లాన్..!

మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి ఓ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. ఇప్పటికే టి.సుబ్బిరామిరెడ్డి ఈ కాంబినేషన్ ఫిక్స్ చేయగా మళ్లీ ఆ సినిమా ఊసే ఎత్తలేదు. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీ అవగా ఆయన ఇప్పుడప్పుడే సినిమాలు చేసే పరిస్థితి కబడటం లేదు. అయితే లేటెస్ట్ గా చిరు, పవన్ మల్టీస్టారర్ ప్రస్థావించాడు అల్లు అరవింద్. 

చిరు, పవన్ మల్టీస్టారర్ సినిమా తీయాలన్న ఆలోచన తనకు ఉందని.. కరుణాకరణ్ డైరక్షన్ లో ఆ సినిమా వస్తే బాగుంటుందని అన్నారు. కరుణాకరణ్ డైరక్షన్ లో సాయి ధరం తేజ్ హీరోగా వస్తున్న తేజ్ ఐలవ్యూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగా మల్టీస్టార్ తప్పక ఉంటుందని గీతా ఆర్ట్స్ లో ఆ సినిమా నిర్మిస్తానని చెప్పారు. ఇక ప్రేమకథల స్పెషలిస్ట్ గా కరుణాకరణ్ సినిమాల గురించి ప్రత్యేకంగా మెచ్చుకున్నారు అరవింద్.