మహేష్ 25.. రిలీజ్ ఫిక్స్..!

భరత్ అనే నేను సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసిన మహేష్ ప్రస్తుతం 25వ సినిమా వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్నాడు. అశ్వనిదత్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం డెహ్రాడూన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.

అసలైతే ముందు 2019 సంక్రాంతి రిలీజ్ అనుకున్న ఈ సినిమా మహేష్ హిట్ సెంటిమెంట్ కలిసి వచ్చేలా ఏప్రిల్ లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 5న ఉగాది సందర్భంగా మహేష్ 25వ సినిమా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. రాజసం టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో మహేష్ ఎం.బి.ఏ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ డైరక్షన్ లో మహేష్ మూవీ ఫిక్స్ చేశాడు.