
టాలీవుడ్ క్లాసిక్ మూవీస్ లో ఒకటైన స్వాతిముత్యం సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. కమల్ హాసన్ నటన, కె.విశ్వనాథ్ దర్శకత్వ ప్రతిభ సినిమాకు నేషనల్ అవార్డ్ సైతం తెచ్చిపెట్టాయి. తెలుగు సినిమాల గురించి చెప్పుకునే ప్రతి సందర్భంలో స్వాతిముత్యం సినిమా ప్రస్థావన తప్పనిసరి. ఇప్పుడు ఆ సినిమా సీక్వల్ తీసేందుకు సిద్ధమవుతున్నాడు సీనియర్ దర్శకుడు తేజ.
స్వాతిముత్యం సీక్వల్ కచ్చితంగా ఇదో పెద్ద సాహసమే అని చెప్పొచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తేజ డైరక్షన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఆ సినిమా స్వాతిముత్యం సీక్వల్ అని అంటున్నారు. ఇప్పటికే దానికి సంబందించిన కథ సిద్ధం చేశాడట తేజ. కొన్నాళ్లు ఫ్లాపులతో వెనుకపడిన తేజ రానా నేనే రాజు నేనే మంత్రి సినిమాతో ఫాంలోకి వచ్చాడు. మరి స్వాతిముత్యం సీక్వల్ అంటే కచ్చితంగా సినిమాపై భారీ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకునేలా సినిమా చేస్తాడో లేదో చూడాలి.