రవితేజ అతనికి ఛాన్స్ ఇస్తున్నాడట..!

మాస్ మహరాజ్ రవితేజ రాజా ది గ్రేట్ తర్వాత చేసిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. టచ్ చేసి చూడు కొత్త దర్శకుడు కాబట్టి ఏదో అనుకున్నారు.. కాని సోగ్గాడే చిన్ని నాయనా, రారండోయ్ వేడుక చూద్దాం హిట్ సినిమాల తర్వాత రవితేజతో తీసిన నేల టిక్కెట్టు ఘోర పరాజయం పొందింది. ఈ సినిమా తర్వాత రవితేజతో సినిమా చేయాలంటే  నిర్మాతలు భయపడే పరిస్థితి ఏర్పడింది.

ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో శ్రీను వైట్ల డైరక్షన్ లో అమర్ అక్బర్ ఆంటోని సినిమా చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమా తర్వాత వక్కతం వంశీ డైరక్షన్ లో మరో సినిమా లైన్ లో పెట్టాడట. రైటర్ గా ఎన్నో సూపర్ హిట్లు కొట్టిన వక్కతం వంశీ డైరక్టర్ గా చేసిన మొదటి ప్రయత్నం నా పేరు సూర్య. బన్ని హీరోగా నటించిన ఆ సినిమా అంచనాలను అందుకోలేదు. రవితేజ టచ్ చేసి చూడు కథ అందించిన వంశీనే మరి వంశీ డైరక్షన్ లో రవితేజ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.