హ్యాపీ వెడ్డింగ్ ట్రైలర్.. బ్యూటిఫుల్..!

సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా నటిస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మన్ కార్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించబడుతుంది. రీసెంట్ గా టీజర్ తో అలరించిన ఈ మూవీ ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజ్ అయ్యింది. ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ అదరగొట్టింది.

వెబ్ సీరీస్ తో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన లక్ష్మన్ కార్య తీసిన మొదటి ఫీచర్ మూవీ హ్యాపీ వెడ్డింగ్. మనసుకి హత్తుకునే ప్రేకథగా రాబోతున్న ఈ సినిమాలో లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యిందని చెప్పొచ్చు. మరి ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. యువి క్రియేషన్స్ బ్యానర్లో సినిమా అంటే ఆడియెన్స్ లో మంచి అంచనాలు ఏర్పడతాయి.. మరి హ్యాపీ వెడ్డింగ్ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.