
బాహుబలి సినిమా నిర్మాతలు శివగామి పాత్ర ప్రధానంగా ఓ వెబ్ సీరీస్ ను రూపొందిస్తున్నారు. బాహుబలి ప్రీక్వెల్ కథతో రాబోతున్న ఈ వెబ్ సీరీస్ ను దేవా కట్ట డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. అయితే ఈ వెబ్ సీరీస్ కూడా మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారట. తెలుగు దర్శకుడే హింది వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.
ఇప్పటికే బాహుబలి నిర్మాతలు స్వర్ణ ఖడ్గం సీరియల్ మొదలు పెట్టారు. బాహుబలి సెట్స్ లో ఈ సీరియల్ షూట్ చేయడం జరిగింది. ఇక ఇప్పుడు వెబ్ సీరీస్ కూడా ఆ నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్నారు. బాహుబలి క్రేజ్ ను నిర్మాతలు ఇప్పుడప్పుడే వదిలేలాలేరు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రకాశ్ కోవెలమూడి డైరక్షన్ లో శర్వానంద్ హీరోగా ఓ సినిమా ప్లాన్ చేసినా అది ఎందుకో ఆగిపోయింది. ప్రస్తుతం ఈ వెబ్ సీరీస్ మీదే అందరి దృష్టి ఉంది.