వైఎస్ బయోపిక్ లో అనసూయ..?

మహి వి రాఘవ డైరక్షన్ లో దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా యాత్ర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వై.ఎస్ పాత్రలో మళయాల స్టార్ హీరో మమ్ముట్టి నటిస్తున్నారు. ఈమధ్యనే మొదలైన యాత్ర మూవీ ప్రస్తుతం కీలక సన్నివేశాల షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో ప్రముఖులు నటిస్తున్నారని తెలుస్తుంది.

లేటేస్ట్ గా ఈ సినిమాలో బుల్లితెర యాంకర్ అనసూయ నటిస్తుందని టాక్. సినిమాలో పొలిటిషియన్ గా అనసూయ కనిపించనుందట. ఇటీవల రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ఆడియెన్స్ ను మెప్పించిన అనసూయ ఈసారి పొలిటిషియల్ రోల్ లో ఎలా అలరిస్తుందో చూడాలి. వై.ఎస్ పాదయాత్ర ముఖ్య నేపథ్యంగా వస్తున్న ఈ సినిమాను బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. విజయ్ చిల్లా. శషి దెవిరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాల్సి ఉంది.