బిజినెస్ అదరగొడుతున్న అల్లుడు..!

అక్కినేని నాగ చైతన్య హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా శైలజా రెడ్డి అల్లుడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఆంధ్రాలో 10 కోట్ల దాకా పలికిందట. చైతు సినిమా ఈ రేంజ్ వెళ్లింది అంటే కచ్చితంగా గొప్ప విషయమే అని చెప్పాలి. ఓవర్ సీస్ రైట్స్ కూడా 3 కోట్ల పైగా వెళ్లాయట.

చైతు కెరియర్ లో ఈ సినిమా హయ్యెస్ట్ బిజినెస్ చేస్తుంది. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సవ్యసాచి మూవీ కూడా చైతు కెరియర్ లో క్రేజీ మూవీగా వస్తుంది. చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న సవ్యసాచి మూవీ కొత్త కాన్సెప్ట్ తో వస్తుంది. మరి బిజినెస్ లో అదరగొడుతున్న నాగ చైతన్య ఈసారి తన సత్తా చాటే హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు.