
బిగ్ బాస్ మొదటి సీజన్ అయితే ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి కచ్చితంగా అందులో కంటెస్టంట్స్ బయట ఎరేంజ్ మెంట్స్ ఏమి చేసుకునే అవకాశం లేదు. కాని మొదటి సీజన్ ఓటింగ్ ప్రాసెస్ చూశారు కాబట్టి ప్రస్తుతం బిగ్ బాస్-2 లో కంటెస్టంట్స్ గా వచ్చిన ఒకరిద్దరు కంటెస్టంట్స్ కొంత ఖర్చు పెట్టి ఓటింగ్స్ కోసం సెపరేట్ సోషల్ మీడియా టీంను ఏర్పాటు చేసుకున్నారట.
ఎలిమినేషన్ రౌండ్ కు రాకుండా మ్యాక్సిమం ట్రై చేయడం హౌజ్ లో ఉన్న కంటెస్టంట్ పని అయితే.. ఒకవేళ ఎలిమినేషన్ కు నామినేట్ అయినా ఓటింగ్ లతో అదిరిపోయేలా చేయాలని ఈ టీం వర్క్ అట. ఇలా హౌజ్ లోకి వెళ్లే ముందు బయట అంతా సెట్ చేసిన వారిలో తేజశ్వి ఉందని అంటున్నారు. అంతేకాదు టివి-9 యాంకర్ దీప్తి కూడా హౌజ్ లోకి అడుగుపెట్టే ముందే సోషల్ టీం ఒకటి ఏర్పాటు చేసిందట. మరి ఇందులో అసలు నిజం ఏంటన్నది తెలియదు కాని బిగ్ బాస్ టైటిల్ కోసం భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది.