చికాగో సెక్స్ రాకెట్.. పూనం కౌర్ కొత్త ట్విస్ట్..!

చికాగో సెక్స్ రాకెట్ పై ఉచ్చు బిగుసుకుంటున్న ఈ సందర్భంలో ఆ లిస్టులో ఉన్న పేర్లు ఇవే అంటూ హీరోయిన్స్, యాంకర్లు అని చూడకుండా మొత్తం 34 మంది పేర్లు బయటపెట్టింది శ్రీరెడ్డి. కాస్టింగ్ కౌచ్ మీద గొంతు పెద్దది చేసి నానా హంగామా చేసిన శ్రీరెడ్డి ఇతరుల విషయాల్లో ఇలా కలుగచేసుకోవడం అందరికి షాక్ ఇచ్చింది. అయితే ఆమె లిస్టులో ఉన్న వారంతా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు.

ఇప్పటికే కొందరు హీరోయిన్స్ ఈ విషయంపై స్పందించగా లేటెస్ట్ గా పూనం కౌర్ సెక్స్ రాకెట్ పై స్పందించింది. అంతేకాదు అసలు కిషన్, చంద్రలు భార్యాభర్తలే కాదు అని బాంబ్ పేల్చింది. అమెరికాలో కిషన్ దంపతులపై నమోదైన కేసు విషయంపై పూనం కౌర్ ఇన్ స్టాగ్రాం లో ఓ పోస్ట్ పెట్టింది. అంతేకాదు అమెరికాలో తాను ఎదుర్కున్న అనుభవాన్ని వెళ్లడించింది.

కిషన్, చంద్రలకు సంబందించిన ఓ వ్యక్తి తన రూం దగ్గరకు వచ్చాడని.. ఆ టైంలో తను మాట్లాడిన విషయం తనకు అర్ధం కాలేదని అతను అనుకోగా అతనికి చెంప దెబ్బతో సమాధానం ఇచ్చానని అన్నది పూనం కౌర్. తనని అమాయకమైన అమ్మాయి అనుకుని తన దగ్గరకు వచ్చాడని తనకు సరైన బుద్ధి చెప్పానని అన్నది పూనం. అమెరికా వెళ్లిన సెలబ్రిటీస్ ను డబ్బుతో కాని లేదా భయపెట్టి కాని ఈ వ్యవహారం నడిపిస్తున్నారని పేర్కొంది పూనం కౌర్.