
రాజమౌళి డైరక్షన్ లో మెగా నందమూరి మల్టీస్టారర్ గా రాం చరణ్, ఎన్.టి.ఆర్ కలిసి చేస్తున్న సినిమా అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లబోతుంది. ఈ సినిమా కోసం ఇద్దరు హీరోలు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. చరణ్ బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తుండగా.. ఎన్.టి.ఆర్, త్రివిక్రం తో అరవింద సమేత సెట్స్ లో ఉన్నాడు.
ఇక రాజమౌళి సినిమా అక్టోబర్ లోనే మొదలవుతుందట.. మల్టీస్టారర్ సెట్స్ లోకి మొదట ఎన్.టి.ఆరే అడుగుపెడతాడట. తారక్ పార్ట్ షూట్ చేశాక చరణ్ ఎంట్రీ ఇస్తాడట. బోయపాటి సినిమా నవంబర్ దాకా షూటింగ్ ఉందని తెలుస్తుంది. మొత్తానికి ఎన్.టి.ఆర్ తో మొదలుపెట్టి చరణ్ తో ఫినిష్ చేయాలన్న జక్కన్న బాహుబలి రేంజ్ హిట్ సినిమా అందించాలని చూస్తున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక, కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.