శేఖర్ కమ్ముల సినిమా ఛాన్స్ అంటూ ఘరానా మోసం..!

ఈమధ్య శ్రీరెడ్డి ఇష్యూతోనే కంగారు పడిన శేఖర్ కమ్ముల అదెలాగు ముగిసింది కదా అనుకున్న టైంలో అతని పేరు మీద జరుగుతున్న ఘరానా మోసం తెలుసుకుని పోలీసులను సంప్రదించాడు. ఫిదా తర్వాత తన తర్వాత సినిమాపై ఎలాంటి ఎనౌన్స్ మెంట్ ఇవ్వని శేఖర్ కమ్ముల తనకు తెలియకుండానే తన సినిమాలో ఛాన్స్ అంటూ కొందరు ఆకతాయిలు చేసిన పని తెలుసుకుని షాక్ అయ్యాడు.

కొత్తవారితో ఎప్పుడూ సినిమాలు చేసే శేఖర్ కమ్ముల తన తర్వాత సినిమా కూడా కొత్త వారితో చేస్తున్నాడని.. దానికి సంబందించిన ఆడిషన్స్ జరుగుతున్నాయని ఓ వెబ్ సైట్ లో పెట్టారు. దానికి ఎంట్రీ ఫీజ్ గా 1500 నుండి 1800 వసూలు చేశారట. అలా వేల కొద్ది సినిమాల్లో నటించాలని ఉన్న వారు డబ్బు కట్టేశారు. ఈ విషయం శేఖర్ కమ్ముల దాకా వెళ్లడంతో అలాంటిదేమి లేదని తేల్చేశాడు. తన అసిస్టెంట్ అని చెబుతూ ఒక కుర్రాడు ఇదంతా చేశాడని తేలింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన శేఖర్ కమ్ముల తన తరపునుండి వివరణ ఇచ్చుకున్నాడు.