కే.టీ.ఆర్ ను భయపెట్టిన సినిమా టైటిల్..!

పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ రెండో ప్రయత్నంగా తీసిన సినిమా ఈనగరానికి ఏమైంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ఆడియోని రీసెంట్ గా రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో రిలీజ్ చేశారు. ఈ వేడుకకు తెలంగాణా ఐటి, పంచాయితి రాజ్ శాఖా మంత్రి కే. తారక రామారావు అతిథిగా వచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కే.టీ.ఆర్ మొదట ఈ సినిమా టైటిల్ చూసి భయపడ్డానని అన్నారు. వర్షాకాలం వస్తే వార్త పత్రికలలో ఈనగరానికి ఏమైంది అని హెడ్డింగులు పెడతారని దానికి సంబందించిన కథ అని అనుకున్నా అన్నారు. కాని ఇది వేరే కథ అని తెలిసింది. హ్యాంగోవర్, జిందగి నా మిలేగే దుబారా లాంటి సినిమాలు తాను ఇష్టపడతానని.. ఈ సినిమా కూడా ఆ కోవలోనే ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కే.టి.ఆర్.

హిట్ సినిమా పడిన తర్వాత స్టార్స్ తో సినిమా తీయకుండా కథను నమ్మి ఈ సినిమా తీశాడు. ఇలానే తను స్టార్స్ ను నమ్ముకోకుండా మంచి కథలతో సినిమా చేయాలని అన్నారు. ఈ సినిమా పెళ్లిచూపులు సినిమా కంటే గొప్ప విజయాన్ని అందుకోవాలని ఆశించారు.