చిరు జడ్జ్ మెంట్ పై రాజమౌళి కామెంట్..!

మెగాస్టార్ చిరంజీవి కేవలం డ్యాన్స్, ఫైట్స్, యాక్టింగ్ మాత్రమే సూపర్ గా చేస్తారని అందరికి తెలుసు. కాని ఆడియెన్స్ కు తెలియని ఓ కొత్త విషయాన్ని రివీల్ చేసి షాక్ ఇచ్చాడు దర్శకధీరుడు రాజమౌళి. అదేంటి అంటే స్టోరీ జడ్జ్ మెంట్ స్కిల్. ఎలాంటి కథ అయినా సరే చిరంజీవి ఒకసారి విన్నారంటే అది వర్క్ అవుట్ అవుతుందా కాదా అని ఇట్టే చెప్పేస్తారట. అంతేకాదు దానిలో కొన్ని మార్పులు కూడా సూచిస్తారని అన్నాడు రాజమౌళి.

మగధీర టైంలో చిరు సలహాలు తమకు ఎంతో సపోర్ట్ గా నిలిచాయని అన్నారు రాజమౌళి. చిరంజీవి కథ విని ఓకే అంటే ఇక ఆ సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ విజేత కథ కూడా చిరంజీవి విని ఓకే చేసిందే అని తెలుస్తుంది. రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కళ్యాన్ దేవ్ తో మాళవిక నాయర్ జోడి కడుతుంది. 

వారాహి చలన చిత్ర బ్యానర్ లో సాయి కొర్రపాటి ఈ సినిమా నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జూలై 12న రిలీజ్ కాబోతుంది. మరి మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న ఈ కొత్త హీరో మెగా అభిమానుల మనసు గెలుస్తాడా లేదా అన్నది చూడాలి.