తేజ్ ఐలవ్యూ.. కరుణాకరణ్ మార్క్ ట్రైలర్..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్, కరుణాకరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా తేజ్ ఐలవ్యూ. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ లో కె.ఎస్ రామారావు చాలా రోజుల తర్వాత ఈ సినిమా నిర్మించారు. ప్రేమకథల్లో తన ప్రతిభ చాటే కరుణాకరణ్ తొలిసారి సాయి ధరం తేజ్ తో చేసిన సినిమా ఈ తేజ్ ఐలవ్యూ. ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. ట్రైలర్ తో ఈ సినిమా లెక్కేంటో చూపించాడు కరుణాకరణ్.  

ఇదో పక్కా లవ్ స్టోరీ అని తెలుస్తుంది.. తేజూకి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటించింది. చూడముచ్చటగా ఉన్న ఈ జంట రొమాన్స్ అదరగొట్టేలా ఉన్నారు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక కెరియర్ లో చాలా వెనుకపడి ఉన్న కరుణాకరణ్ మెగా హీరో సాయి ధరం తేజ్ తో చేసిన ఈ తేజ్ ఐలవ్యూ కచ్చితంగా అటు దర్శకుడిని, హీరోని గట్టెక్కించేస్తాయని అంటున్నారు. గోపిసుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా జూలై 6న రిలీజ్ అవుతుంది.