ఇదం జగత్.. సుమంత్ ఇంట్రెస్టింగ్ అటెంప్ట్..!

అక్కినేని ఫ్యామిలీ నుండి వచ్చినా కనీసం హీరోగా నిలదొక్కుకోలేని సుమంత్ తన లేటెస్ట్ మూవీ మళ్లీ రావా సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ సినిమా ఇచ్చిన హిట్ జోష్ తో సుమంత్ మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం సుమంత్ నటిస్తున్న సినిమా ఇదం జగత్. అనీల్ శ్రీకంఠం డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజ్ చేశారు.


ఈ ఫస్ట్ లుక్ చూస్తే సుమంత్ మరో ఇంట్రెస్టింగ్ అటెంప్ట్ చేస్తున్నాడని తప్పక చెప్పచ్చు. ఓ డెడ్ బాడీని టార్చ్ లైట్ తో చూస్తున్న సుమంత్ పిక్ చాలా ఇంటెన్సిటీతో కనిపిస్తుంది. కచ్చితంగా మళ్లీరావా తర్వాత సుమంత్ కు ఈ సినిమా కూడా మంచి హిట్ మూవీ అయ్యేలా ఉంది. జొన్నలగడ్డ పద్మావతి, గంగపట్న శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబందించిన మిగతా డీటైల్స్ తెలియాల్సి ఉంది.