
మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా రాకేష్ శషి డైరక్షన్ లో వస్తున్న సినిమా విజేత. మెగాస్టార్ సూపర్ హిట్ సినిమా టైటిల్ తో వస్తున్న ఈ మెగా మేనళ్లుడు సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఆదివారం సాయంత్రం మెగా అభిమానుల సమక్షంలో జరిగింది. రాజమౌళి, చిరంజీవి ఈ ఆడియో వేడుకకి ముఖ్య అతిథులుగా వచ్చారు.
తండ్రికొడుకుల సెంటిమెంట్ తో విజేత సినిమా వస్తుందని తెలుస్తుంది. ట్రైలర్ లో మెగా అల్లుడు ఇంప్రెస్ చేశాడు. మురళి శర్మ తండ్రి పాత్రలో బాగున్నాడు. మాళవిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జూలై 12న రిలీజ్ అవబోతున్న ఈ సినిమాతో కళ్యాణ్ దేవ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.