మెగా ప్రొడ్యూసర్ తో సూపర్ స్టార్..!

సూపర్ స్టార్ మహేష్ మెగా ప్రొడ్యూసర్ తో సినిమా చేస్తున్నాడా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ భారీ బడ్జెట్ సినిమాలు చేస్తూ వచ్చారు. ఇన్నాళ్లు మెగా హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చిన అల్లు అరవింద్ బయట హీరోలతో కూడా సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ఈ క్రమంలో మహేష్ తో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారట.

ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత సుకుమార్ సినిమా లైన్ లో ఉంది. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగ కూడా మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు. గీతా ఆర్ట్స్ వారు మహేష్ తో సినిమా ఎవరి డైరక్షన్ లో చేస్తారో చూడాలి. మెగా నిర్మాతతో సూపర్ స్టార్ మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.