
సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల కలిసి చేస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్. లక్ష్మణ్ కార్య డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ బ్యానర్ లో వస్తుంది. ఎం.ఎస్ రాజు తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కెరియర్ అటు ఇటుగా ఉంది. ఇలాంటి టైంలో కొణిదెల వారసురాలు నిహారికతో జోడిగా వస్తున్న సినిమా హ్యాపీ వెడ్డింగ్.
ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అబ్బాయి ఆనంద్, అమ్మాయి అక్షర ఇద్దరికి పెళ్లి.. మరి ఈ హ్యాపీ వెడ్డింగ్ కథ ఏంటో కాని టీజర్ అయితే కలర్ఫుల్ గా ఉంది. సుమంత్, నిహారిక జంట చూడముచ్చటగా ఉందని చెప్పొచ్చు. శక్తి కాంత్ కార్తిక్ ఫిదా తర్వాత చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ఇది మరి టీజర్ తో ఇంప్రెస్ చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.