చరణ్ సినిమా రేటు అదిరింది..!

రంగస్థలం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రాం చరణ్ ఆ సినిమా ఎఫెక్ట్ బోయపాటి సినిమా బిజినెస్ కు హెల్ప్ అయ్యేలా చేసుకున్నాడు. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా యువి క్రియేషన్స్ వారు తెలుగు రెండు రాష్ట్రల్లో రిలీజ్ చేసేందుకు 70 కోట్ల కోట్ చేశారట. ఓవర్సీస్ తో కలుపుని ఈ లెక్క వేరేలా ఉందని తెలుస్తుంది.

రంగస్థలంతో తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేసుకున్న రాం చరణ్ కరెక్ట్ సినిమా పడితే రికార్డులే అని సత్తా చాటాడు. అందుకే బోయపాటి సినిమా కూడా భారీ రేటుకి వెళ్లింది. యువి క్రియేషన్స్ వారి వి సెల్యులాయిడ్ సంస్థ ఈ డీల్ సెట్ చేసుకుందట. కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి బరిలో రాబోతుంది.