సంబంధిత వార్తలు

సూపర్ స్టార్ మహేష్ తన సినిమా గురించే కాదు మనసుకి నచ్చిన ఏ హీరో సినిమా గురించైనా సరే మాట్లాడేస్తాడు. రీసెంట్ గా తన బావ సుధీర్ బాబు నటించిన సమ్మోహనం సినిమా గురించి ట్వీట్ చేసి చిత్రయూనిట్ ను ప్రశంసించిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా విశాల్ హీరోగా నటించిన అభిమన్యుడు సినిమా గురించి కూడా ట్వీట్ చేశాడు మహేష్.
అభిమన్యుడు ఇంప్రెస్ చేసింది. దర్శకుడు మిత్రన్ స్టోరీ విజన్ దాన్ని తెరకెక్కించిన విధానం చాలా బాగుందని అన్నారు. ఇక ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా హీరో విశాల్ కు చిత్రయూనిట్ అందరికి కంగ్రాట్స్ చెప్పాడు మహేష్. పందెం కోడి తర్వాత విశాల్ తెలుగులో అందుకున్న సూపర్ హిట్ సినిమా అభిమన్యుడే.