ఢీ-10 ఫైనల్స్ కు ఎన్టీఆర్..!

ఈటివిలో ప్రసారమవుతున్న ఢీ షో చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఎన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ వచ్చినా సరే ఢీ షోని ఢీ కొట్టలేదు. అందుకే 10 సీజన్స్ గా ఢీకి బాగా క్రేజ్ ఏర్పడింది. మొదట్లో ప్రభుదేవ గెస్ట్ గా ఫైనల్స్ జరిగేవి. లాస్ట్ ఇయర్ రాజమౌళి ఫైనల్స్ గెస్ట్ గా వచ్చారు. ఢీ 10 ఫైనల్స్ కు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ చీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. 

సుధీర్, రష్మి రెండు టీముల నుండి ఇద్దరు ఇద్దరు ఫైనల్స్ కు చేరుతారు. వారిలో ఫైనల్స్ కు వెళ్లేది ఇద్దరు.. ఆ ఫైనల్ పోరులో ఎవరు గెలుస్తారో వారికే ఢీ టైటిల్ వస్తుంది. శేఖర్ మాస్టర్, ప్రియమణి, అని మాస్టర్ జడ్జులుగా ఉన్న ఈ డ్యాన్స్ షోలో ఎన్.టి.ఆర్ గెస్ట్ గా రావడం సర్ ప్రైజింగ్ అని చెప్పొచ్చు. టాలీవుడ్ హీరోల్లో డ్యాన్స్ లో నెంబర్ 1 అంటే ఎన్.టి.ఆరే మరి అలాంటి డ్యాన్సింగ్ స్టార్ డ్యాన్స్ షోకి గెస్ట్ గా వస్తే ఎలా ఉంటుందో చూడాలి.