అనుష్కతో పెళ్లిపై ప్రభాస్ రియాక్షన్..!

బాహుబలి తర్వాత తన పెళ్లి ఉంటుందని చెప్పిన ప్రభాస్ ఆ సినిమా రెండు పార్టులు రిలీజ్ అయ్యాక వెంటనే సాహో షూటింగ్ మొదలుపెట్టాడు. ప్రభాస్ పెళ్లి లెటు అవుతున్నా కొద్ది రూమర్స్ ఇంకా ఇంకా పెరుగుతున్నాయి. కొన్నాళ్లుగా స్వీటీ అనుష్కనే ప్రభాస్ పెళ్ళాడతాడని కొందరి అభిప్రాయం. ఈ విషయంలో అనుష్క, ప్రభాస్ ఇద్దరు స్పందించారు కూడా.. కాని ఆ రూమర్స్ కు మాత్రం ఫుల్ స్టాప్ పడట్లేదు. 

ఈమధ్య ఓ ప్రముఖ పేపర్ లో కూడా ప్రభాస్, అనుష్కల పెళ్లి ప్రస్థావన తీసుకొచ్చారు. ఓ పక్క కృష్ణం రాజు ఈ ఇయర్ ఎలాగైనా ప్రభాస్ కు పెళ్లిచేయాలని ఫిక్స్ అయ్యారని చెప్పారు. తన పెళ్లిపై మీడియా చూపిస్తున్న ఇంట్రెస్ట్ కు ప్రభాస్ రెస్పాండ్ అయ్యాడు. పెళ్లి అనేది తన పర్సనల్ మ్యాటర్ అని ఎవరికి తెలియకుండా చేసుకునే పరిస్థితి లేదని. తప్పకుండా మీడియాకు, ఫ్యాన్స్ కు ఎనౌన్స్ చేస్తానని అన్నారు ప్రభాస్. అయితే అనుష్క తో వచ్చిన రూమర్స్ గురించి స్పందించడమే మానేశాడు ప్రభాస్.