ప్రేమమ్ ఆడియా లాంఛ్‌కు ముహూర్తం ఫిక్స్!

మళయాలంలో ప్రేమమ్ సినిమా గురంచి తెలియని వారుండరు. అక్కడ ఆ సినిమా సంచలన విజయం సాధించడంతో ఇతర భాషల్లో సైతం ఆ సినిమాను రీమేక్ చేస్తున్నారు. తెలుగు రీమేక్‌లో ‘ప్రేమమ్’ను అదే పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోగా అక్కినేని నాగచైతన్య నటిస్తుండగా అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కార్తికేయ సినిమాతో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న చందూ మొండేటి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. మళయాలంలో సూపర్ సక్సెస్ కొట్టిన ఈ సినిమా తెలుగులోనూ మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది. అయితే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి చాలా రోజులు అవుతుంది.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన షూటింగ్, రెండు పాటలు మినహా పూర్తయ్యిందని సమాచారం. ఈ పాటలను నార్వేలో చిత్రీకరించనున్నారు. జూలై 14న మొదలయ్యే ఈ షెడ్యూల్‌ వీలైనంత త్వరగా ముగిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ప్రేమమ్ ఆడియో విడుదల ఆగష్టు 7న నిర్వహించడానికి రెడీ అయ్యారు. పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ప్రేమమ్ సినిమా నాగచైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ మూవీ అవుతుందని నమ్ముతున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేయడం మరో విశేషం. ఆగష్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రేమమ్ సినిమా, ఎటువంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.