
గతంలో నాగార్జున - దాసరి కాంబినేషన్‌లో వచ్చిన మజ్ను, సూపర్ హిట్ అవడంతో, అదే టైటిల్ ని చందు మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య సినిమాకి పెట్టుకుందామనుకున్నా, ఆ తరువాత ఎందుకో అది వర్క్‌అవుట్ కాలేదు. అందుకే వారు తీస్తున్న సినిమాకు ఒరిజినల్‌గా ఉన్న ప్రేమమ్ పేరునే ఆ ఫీల్ పోకూడదని ఉద్దేశంతో వాడుతున్నారు. ఇకపోతే.. ఇప్పుడు మజ్ను టైటిల్‌పై కన్నేశాడు నాని.
జెంటిల్‌మేన్ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న నాని తన నెక్స్ట్ మూవీ, డైరెక్టర్ విరించి వర్మతో చేస్తున్నట్లు గతంలోనే తెలిపాడు. ఇప్పుడు ఈ సినిమాకు మజ్ను అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ సినిమాకు అదే పేరు ఖరారు చేయడం ఖాయం అని తెలుస్తుంది. ఇప్పటికే నాని పాత సినిమాల టైటిల్స్‌తో హిట్స్ కొడుతూ వస్తున్నాడు. పిల్ల జమిందార్, జెంటిల్‌మన్ ఇలా పాత సినిమాలను తన టైటిల్స్‌గా వాడుకుంటూ వస్తున్నాడు. మరి మజ్నుగా నాని మారుతాడా లేదా అనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.